23, డిసెంబర్ 2009, బుధవారం

కిం

ప్రేమంటే ఏమిటని
ఆమె అడిగింది
రెండు శరీరాల కలయిక
అన్నాడు ఒక యువకుడు
రెండు అహాల అసంతృప్తి
అన్నాడొక
మధ్య వయస్కుడు
రెండు హృదయాల కలయిక
అన్నాడొక వృద్దుడు
ప్రేమంటే ఏమిటని
ఆమె మళ్ళీ అడిగింది
ఒక సౌందర్య సాధన
అన్నాడొక భావుకుడు
ఒక ఆధ్యాత్మిక సంవేదన
అన్నాడొక వేదాంతి
ప్రేమంటే ఏమిటని
ఆమె మళ్ళీ అడిగింది
పోనీ నువ్వే చెప్పరాదా అన్నారు ఐదుగురు
ప్రేమంటే
ఆమె అల్లరిగా నవ్వి
ప్రేమే అంది

- వంశీకృష్ణ


4 కామెంట్‌లు:

  1. వంశీ:

    ఇప్పుడే నీ కొత్త దేహం విదేహ చూశాను. చాలా అందంగా వుంది. రోజూ రాయాలనిపించేటట్టుగా.

    ఇకనేం? రాయ్...నీ వుత్తరాలూ, కవిత్వమూ...అన్నీ

    అఫ్సర్

    రిప్లయితొలగించండి
  2. కొత్తగా బ్లాగలోకం లోకి ప్రవేశించిన మరో కవి కోకిలకు ఆహ్వానం.

    రిప్లయితొలగించండి
  3. నిజమే..ప్రేమంటే ప్రేమే!
    నిర్వచించిన ప్రతిసారీ ఆ నిర్వచనం "ప్రేమ కాదు" అనుకోవడానికి మాత్రం పనికొస్తుంది.

    రిప్లయితొలగించండి