సుమం రాలింది
సౌరభం గాయ పడింది
వెన్నెల మరణించింది
చల్లదనం నిప్పుల ఉప్పెన గా మారింది
వుద్వేగాలన్నీ ఉద్యమాలు కానట్టే
ఆవేశాలన్నీ ఆలోచనలు కానక్కర లేదు
నిజానికీ అబద్దానికీ మధ్య
ఆటకీ దొంగాటకీ మధ్య
జననానికీ మరణానికీ మధ్య
ఒక సన్నటి తెర ఏదో రంగస్థలం మీద
జారదానికే సదా సిద్హం గా వుంటుంది.
************
మరణానికి దేహాన్ని ఇచ్చిన అతడు
ఆత్మహత్యకి అర్థమేమిటంటే
నిరసనకి అది ప్రతి రూపం అన్నాడు.
పదవులకి ఉద్యమాన్ని ఇచ్చ్హిన అతడు
ఆత్మహత్యకి అర్థమేమిటంటే
అధికారానికి దూరంగా జరగడం అన్నాడు.
ఇంతా చేసి
మరణానికి దేహాన్ని ఇచ్చిన అతడు కోరిందేమిటి?
వాసంత సమీరంలాంటి ఒక పూల పొదరిల్లు.
మనసు విప్పుకోవడానికి హరివిల్లు లాంటి నెచ్చెలి తడి వొళ్ళు.
************
ఉద్యమం ఈ దేశ రాజ్యాంగం కాదు
ఎవరు పడితే వారు సవరించి పారెయ్యడానికి
ఉద్యమం అదుర్స్ అనే తెలుగు సినిమా కథా కాలాక్షేపం కాదు
ఎవరి ముందు పడితే వారి ముందు మోకరిల్లి
నేడే విడుదల అనడానికి
************
ఉద్యమానికి పుల్ స్టాప్ వుండదు
కామాలు తప్పేస్తే .........,!
.
(యాదయ్య మరణానికి బాధతో)
- వంశీ కృష్ణ
.
So true.
రిప్లయితొలగించండిwell said.