వర్షించే మేఘం ఒకటి
చినుకుల పెదవులతో
నేలను ముద్దాడాలనుకుంది.
వికసించే కుసుమం ఒకటి
పరిమళాల చేతులతో
మేదిని ముంగిట
బంగారు రంగవల్లిక దిద్దాలనుకుంది.
ప్రవహించే సెలయేటి గమకం ఒకటి
పుడమి తల్లి చరణ మంజీర
స్వర ధునిలో ఒదిగి పోవాలనుకుంది.
తొలి సంజ లేలేత ఎరుపు
చిగురాకు ఒకటి
సిగ్గుపడ్డ భూమి బుగ్గలో మొగ్గై పూయాలనుకుంది.
స్వార్ధ పరుడైన మనిషి ఒకడు
ఈ నెల తనకే సొంతం అనుకున్నాడు.
ఎవరి భూమి ఇది?
ఎవరి సొంతం ఇది?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి