ఈ పిల్లలని
ఈ పిల్లలని అర్ధం చేసుకొవడం బహు కష్టంతేనె చినుకులా ఎప్పుడు నవ్వుతారో
చలి వణుకులా ఎప్పుడు ఏడుస్తారో ...
ఆ నవ్వు వెనుక వున్నదంతా దుఖమేనా?
ఆ ఏడుపు వెనుక వున్నదంతా ఆనందమేనా?
ఫిల్లలు ద్వందా లకి అతీతులు
సరిహద్దుల సంకేతాలు లేని సంధ్యా రాగపు సరిగమలు వాళ్ళ సొంతం
ఈ పిల్లలని అర్ధం చేసుకోవడం బహు కష్టం
వున్నదంతా వూడ్చేసి పక్క వాళ్ళకి ఇవ్వగలరు.
లేనిదాని కోసం హఠం చేసి ఏడ్పించనూ గలరు.
ఇవ్వడం వెనుక వున్నదంతా తీసుకొవడమేనా?
హఠం వెనుక వున్నదంతా ఇవ్వడమేనా?
ఫిల్లలు లోయలూ శిఖరాలూ అలవోకగా ఏక్కగలరు
జీవితం కంచీ దెబ్బలకి మనం విల విల లాడుతుంటే
వాళ్ళు మాత్రం చిద్విలాసం గా నవ్వగలరు
ఈ పిల్లలని అర్ధం చేసుకోవడం బహు కష్టం
ప్రేమిస్తూనే ఆటలో అరటిపండులా ద్వేషించగలరు
ద్వేషిస్తూనే ప్రేమాన్విత గాత్రమై శత్రువును కౌగలించుకోగలరు
ప్రేమనూ ద్వేషాన్ని
భూగోళమనే నాణేనికి వొకే వైపు నిలిపి
కొనగోటితొ ఏగుర వెయ్యగలరు
ఈ దేశపు అత్యున్నత పీఠం పైన ఒక పసివాడిని నిల్పండి
వాడు దేశానికి ప్రేమించడం ఎలాగో నేర్పిస్తాడు
ద్వేషాన్ని ద్వేషించడం ఎలాగో పాఠం చెపుతాడు
................................వంశీక్రిష్ణ
కవిత ఆసాంతం అద్భుతంగా ఉంది.
రిప్లయితొలగించండిముఖ్యంగా .. ఈ లైన్స్ చాలా బాగున్నాయి.
ఈ దేశపు అత్యున్నత పీఠం పైన ఒక పసివాడిని నిల్పండి
వాడు దేశానికి ప్రేమించడం ఎలాగో నేర్పిస్తాడు
ద్వేషాన్ని ద్వేషించడం ఎలాగో పాఠం చెపుతాడు
hats off !!
nice poetry
రిప్లయితొలగించండిhi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg