అదిగో ఆ మూల అతడు కూర్చునేవాడు
ఎడారిలో ఖర్జూరాల బిడారు లాగ
అతనిముందు వున్న సీసాలలో రకరకాల బిస్కెట్లు నోరూరించేవి
చేతికి అందే అంత దూరంలో వున్న టేప్ రికార్డర్ లోంచి
జబ దిల్ హి టూట్ గయా అంటూ
ముక్కలు ముక్కలు గా ముఖేష్ స్వరం గాలి అలలలో తేలి వచ్చి
ఇరానీ చాయ్ పోగాలలో కలిసి పోయేది
అమ్మ మనసంత చల్లనైన నాప రాళ్ళ బల్ల మీద
సియాసత్ దక్కన్ క్రానికల్ పేపర్లు ముక్కలు ముక్కలు గా వార్తలను
టీ ప్రియులకి అందించేవి
అతడి వెనుక నిలువెత్తు మధు బాల నలుపు తెలుపు బొమ్మ
జీవితంలోని నలుపుని ప్రేమలోని తెలుపుని బొమ్మ కట్టి మరీ చూపించేది
అఫ్జల్ భై డో సమూసా ఏక్ చాయ్ అన్నా అభ్యర్ధనలు పడే పడే వినిపించేవి
కేఫ్ ముందు చింపిరి జుట్టు , మూగ కళ్ళ బిచ్చగత్తె ఒకతి
రెండు బిస్కుట్ల కై జాలిగా చూస్తుంటే
ఒక మూల రాజకీయ , సాహిత్య, ఆర్ధిక విషయాల మీద జోరుగా చర్చల మీద చర్చలు సాగేవి
ఒక కవి మిత్రుడు జేబులోని రెండు రూపాయ బిల్లల లో నుంచి ఒకటి తీసి
బిచ్చగత్తె కి ఇస్తే
నలుపు తెలుపు గడ్డం కేఫ్ యజమాని నాలుగు బిస్కట్లు ఇచ్చే వాడు.
ఇరాని చాయ్ రెండు కప్పులు తాగి
నాలుగు గంటలు నింపాది గా కవిత్యోద్యమాలకి నాంది వాచకాలు మొదలయ్యేవి
చాదర్ ఘాట్ బ్రిడ్జి మీంచి
నల్లగొండ చౌరాస్తా మీంచి
ఆ చివర ఉస్మానియా యూనివర్శితి మీంచి
మట్టి గాలులను కొత్త గా చేరిన విద్యార్ధుల తో పాటుగా
భయం భయం గా ముందు కు వస్తే
నగరాన్ని పరిచయమ చేసే పరిచిత అద్దా గా నా ఇరానీ కేఫ్
మళ్ళే ఇన్నాళ్లకు
చాదర్ఘాట్ బ్రిడ్జి ముందు నిల్చుంటే
ఇరానే కేఫ్ లేదు కానీ
స్వగృహఫుడ్స్ అద్దాల వెనుక నుండి మోహ పెడుతూ రా రమ్మంది
కార బిస్కుట్లకు బదులు పూతరేకులు పలకరించాయి
ఉప్పు బిల్లల కి బదులు పిజ్జాలు బర్గుర్ లు వయ్యారాలు పోతూ కనిపించాయి
అతడి వెనుక మధుబాల లేదు
అతడి కళ్ళలో జాలీ లేదు
నా ఇరానీ కేఫ్ చచ్చి పోయింది
ఒక సంస్కృతి మరణించింది
జీవితంలో ఒక భరోసా ఒక నిమ్పదీతనం మరణించింది
ఒక సంస్కృతి మరనిన్చిందంటే
ఒక జాతి మరనిన్చినట్లే
ఎంత బాగా వ్రాసారండి!
రిప్లయితొలగించండికరగిపోతున్న హైదరాబాద్ అస్థిత్వాన్ని కళ్ళకు కట్టారు.
ఇలాంటి కవితలు చదివితేనన్నా, తెలంగాణ ప్రజల ఆవేదన కుహనా సమైక్యవాదులకు అర్థం అవుతుందేమో!
అక్కడక్కడా అక్షర దోషాలున్నాయి. సరి దిద్దండి.
మీకు నా మనఃపూర్వక శుభాభినందనలు!
వంశీ,
రిప్లయితొలగించండిచాలా రోజులకు నీ కవిత చూస్తునాను. బావుంది.
అన్నయ్యా .. నిన్న ఆదివారం ఆంధ్ర జ్యోతి లో చదివాను ... చాలా బాగుంది ...మీ కవిత ..
రిప్లయితొలగించండిఇరానీ చాయ్, ఆ కేఫ్ లను చాలా రోజుల తర్వాత కళ్ళ ముందు ఉంచారు. ఎప్పటివో జ్ఞాపకాలు......రోడ్డు పై నిలబడి చాయ్ తాగాలమిపిస్తే ఇరానీ కేఫ్ వెతుక్కున్న రోజులు....ఏవి తల్లీ ఆ రోజులు.....వరంగల్ లో జ్ఞాపకం జవహర్ కేఫ్, చౌరస్తా లో కోహినూర్, వేడి వేడి చాయ్, బన్ను, లేదా బిస్కెట్స్, అక్కడ పరీక్షల టైములో ఔటయ్యే ప్రశ్నా పత్రాలు థాంక్స్ మళ్లే ఆ రోజులు ఒక్క సారిగా చుట్టుముట్టాయి
రిప్లయితొలగించండిఆచార్య ఫణీంద్ర గారిదే నా కామెంట్ కూడా
రిప్లయితొలగించండి