వినాయక్ సేన్ కి జీవిత ఖైదు విధించినట్టు రాయపూర్ కోర్ట్ తీర్పు ఇవ్వడం ఊహించిందే. ఆశ్చర్యం ఏది కలిగించలేదు.ఈ సందర్భం గా నాకు కలిగిన ఒక సందేహం మీతో పంచుకోవడానికి ఈ నాలుగు మాటలు. వినాయక సేన్ కి మావోఇస్తులతో సంబంధాలు వున్నాయని, ఆయన వాళ్లకి కొరియర్ లాగా వ్యవహరించాడని ఆరోపణ. జైల్లో వున్న నారాయణ సన్యాల్ ఇచ్చిన ఒక వుత్తరాన్నే కలకత్తా లోని వ్యాపారి కి చేరవేసాదని తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టే రాజద్రోహ నేరానికి ఆయన పాల్పడ్డాడని రాయపూర్ కోర్ట్ నిర్ధారణకి వచ్చింది. రాజద్ర్హనికి పాల్పడినందుకు కోర్ట్ శిక్ష వేయాల్సిందే. అది న్యాయం కూడా.
మావోయిస్తులవి ప్రధాన స్రవంతి రాజకీయాలు కావు. ప్రత్యమ్నాయ రాజకీయాలు. వాళ్ళకి ఈ దెస చట్టలపట్ల kఆని రాజ్యంగంపట్ల కాని నమ్మకం కాని, గౌరవం కాని లేవు. కనుక వాళ్ళు తాము నమ్మిన రాజకీయ వ్యవస్థను నెలకొల్పడం కోసం వాళ్ళ పంధాలో ప్రయత్నం చేస్తారు. ఆ క్రమం లో వినాయక సేన్ లాంటి వాళ్ళు పోషించాల్సిన పాత్ర పోషిస్తారు కూడా. కాని అసలు సమస్య ఇది కాదు. ప్రధాన స్రవంతి రాజకీయాలను నమ్మని వాళ్ళను , ప్రధాన స్రవంతి చట్టాలు, కోర్టులు సిక్షిస్తున్నాయి. అందుకు కూడా అభ్యంతరం లేదు.
కానీ, ప్రధాన స్రవంతి రాజకేయాలలో వున్నవాళ్ళు, ఈ దేశ చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పే వాళ్ళు , చట్ట విరుద్దమ గా ప్రవర్తిస్తే, రాజ్యంగా ధిక్కారానికి పాల్పడితే, రాజ ద్రోహ నేరానికి పాల్పడితే చటాలు, కోర్టులు ఇవే శిక్షలు వేస్తాయ అన్నదే అసలు ప్రశ్న?
మనది ప్రజాస్వామ్యం. దాంట్లో ఎన్ని లోపాలు ఐన ఉండవచ్చు గాక. ఒక చట్ట బద్దం గా ఎన్నికలు నిర్వహించి, ప్రజల తీర్పు తీసుకొని వ్యక్తులు, పార్టీలు అధికారం లోకి వస్తాయి. తమ తమ మనిఫెస్తోలని అమలు చేయదని ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రజల తీర్పు నిజం గా ప్రజలు ఇచ్చిన తీర్పు అవుతుందా? మనిపులతే చేసి, పారిశ్రామికవేత్తలు, కుహన రాజకీయ నాయకులూ రిగ్గింగ్ చేసి పొందిన తీర్పా అన్నా మాట అటు ఉంచితే, ససనబడ్డం గా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలని గౌరవించాల్సిన నిబద్దత ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులకి వుందా వద్దా అన్నది అసలు ప్రశ్న?
ఇరవై, ముప్ఫై, మంది ఏం ఎల్ ఏ ల ని చేతి లో ఉంచుకుని శాసన బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలని కూల్చలనుకోవడం రాజ ద్రోహ నేరం కిందకి రాదా
కర్ణాటక లో ధన బలం తో ఎద్యురప్ప ప్రభుత్వాన్నే పడగోత్తలునుకున్న వాళ్ళని, ఆంధ్ర లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని రాజ ద్రోహ నేరం కింద మన కోర్టులు శిక్ష విధిస్తాయ? నేను మాతలుడుతున్నది ప్రజస్వమ్యబడ్డం గా శాసన సభల లో పెట్టె అవిశ్వాస తీర్మనల్గురించి కాదు. ధన బలంతో, అధికార వ్యామోహంతో అస్తిరత సృష్టించి, ప్రజల తీర్పు తో అతలడుకునే వాళ్ళ గురించి.
మావోఇస్తులు రాజ ద్రోహ నేరాల కింద ఒక సిద్దాంత ద్రుక్పాహం వుంది. జగన్మోహన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి లాంటి వాళ్ళ వెనుక ఏ సిద్దాంత బలం వుంది. దేశాన్ని దోచుకోవాలనుకునే దుగ్ధ తప్పిస్తే
వినయక్సేన్ కి జగన్ మోహన రెడ్డి కి మన కోర్టులు ఏ తేడ పాటిస్తాయి