12, ఏప్రిల్ 2011, మంగళవారం

రుబాయీలు

ఆమెను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను "నేను" అనే పదబంధాన్ని ద్వేషించి మరీ ఆమెకు సమర్పించుకున్నాను నా ఉనికి అంటూ ఇంకా ఎక్కడుందే చంద్రముఖీ ఆమె ఆత్మ లో నేను పరంపరాగతం గా లీనమయ్యాను. నిన్న లేదని నేను అంటే రేపూ లేదని ఆమె అన్నది ఈ క్షణం లో జీవించమని చెప్పకనే చెపుతున్నది తత్వ చింతనా సారమెంత మధురమో కదా నా ప్రియ సఖీ ! జీర్ణ దేహాన్ని విడిచి చిలుక కొత్త పంజరాన్ని వెతుకుతున్నది. ఆమెను చూస్తుంటే అవని మీద అద్భుతమైన ఇంద్రధనస్సు నడుస్తున్నట్లే వుంది ఆమెను వెతుకుతుంటే నింగి అరచేత ఇమిడి నట్లే వున్నది వూహ లెప్పుడు బాగానే వుంటాయి వాస్తవాలు కరకు క్షార సముద్రాలు కదా కావేరీ ! వాస్తవానికి ఊహకూ మధ్య ఊయల లూగాడమే జీవితమని ఆమె చెపుతున్నది.