26, జనవరి 2010, మంగళవారం

గణతంత్ర సమయాన

అరవయ్ సంవత్సరాల గణతంత్ర ప్రజా స్వామ్య భారత దేశంలో తల ఎత్తుకొని తిరిగేవి ఏవి ? అని ప్రశ్నించుకుంటే స్థిరంగా దొరికే జవాబు ఒకటే. అవినీతి, ఆశ్రిత పక్ష పాతం, నా కెందుకులే అనే నిరపేక్షమైన నిర్లిప్త ధోరణి. మనలని ఊగించి , ఊరించి, శాసించే ఆశయాలు ఒకటీ ఈనాడు లేవు. మనిషిని మనిషి గా నిలిపే తాత్విక బంధం ఒకటీ మన కళ్ళ ముందు కనపడటం లేదు.ప్రతి మనిషి మరొక మనిషి కి ఆరో లేదా ఏదో కార్బన్ కాపీ గా మారి పోతున్నాడు. పోనీ ఆ ఒరిజినల్ మనిషి అయినా నికార్సైన మనిషా అంటే అదీ కాదు. గమ్యం పట్ల తప్పిస్తే గమనం పట్ల మనకు పట్టింపు అసలే లేదు. డబ్బు సంపాదన ఒకటే మన పరమ లక్ష్యం. దాన్ని సాదించే క్రమం లో మన విద్యా వ్యవస్థ నాశనం అయింది. మన వివాహ వ్యవస్థ నాశనం అయింది. కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ అన్నీ పతనావస్థకు చేరుకున్నాయి. దీనంతటికి కారణాలు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నాయి.
ఇలాంటి అవస్థకి కారణమైన మనుషుల గురించి మ్యూసింగ్స్ లో చలం ఒక మాట అంటాడు. "ఏదో బతుకులో వుండటం తప్ప, ఒకటి కావాలని గానీ, ఒక దాని నుంచి తప్పిచ్చుకున్దామని గానీ గట్టిగా ప్రయత్నిచడం మనుషులకు ఒక వింత. రోజూ చేసే పనులే అట్లా తిరిగి తిరిగి చెయ్యడం, ఏదన్న కష్టం వస్తే ఏడవడం, మనుషుల సంగతీ, పరిస్థితుల సంగతి అర్థం పర్థం లేకుండా మాట్లాడం. ఇంతే జీవితం. రైళ్ళలో. క్లబ్ ల లో మనుషులు మాత్లాదుథూ వుంటే వీరు చాలా బాగా గొప్ప వేదాన్తులా అనిపిస్తుంది. ఏమీ మనసు పొరల నుంచి కిందకు తీసుకోరు అనిపిస్తుంది.
ఈ కూరలో ఉప్పు ఎక్కువ అయింది
షర్టు చాకలి వాడు తెల్లగా వుతికాడు.
బండివాడు ఒక పావలా అన్యాయం గా కాజేశాడు
సినిమాలో మా ఆయన బంగారం బావుంది.
ఈ వాక్యాలన్నితికి ఒక్కటే విలువ ఇచ్చి మాట్లాడతారు. ఇట్లా బతకడం తప్ప , సుఖంలో , బాధలో కూడా గొప్పగా జీవించడం అంటే ఏమిటో కూడా అర్థం కాదు. గొప్ప మొహాన్ని గానీ ప్రేమని గానీ చూసినప్పుడు అర్థం కాక, తమకే అర్థం ఐఏ కామం, ధనం మదం, చపలత్వం ఇట్లాంటి కారణాలు అరూపిస్తూ మాట్లాడతారు."

సమాజంలో వున్న అన్ని అవలక్షనాలకు ఒకటే రకంగా ప్రతిస్పందిచాదము ఈ దేశ దౌర్భాగ్యం.
ఇప్పుడు మనిషి మళ్ళీ తనను తాను నిర్వచించుకోవాలి. తనను వశపర్చుకునే అన్నీ లౌల్యలను వదులుకుని, సామాజికం గా , మానసికంగా కొత్త గా మనిషికి అర్ధాలు చెప్పుకోవాలి.
మొత్తం గా మనం మళ్ళీ మన జాతి మొత్తాన్ని అ నుండి అక్షరాభ్యాసం చెయ్యాలి.

6, జనవరి 2010, బుధవారం

వర్షించే మేఘం ఒకటి .........

వర్షించే మేఘం ఒకటి
చినుకుల పెదవులతో
నేలను ముద్దాడాలనుకుంది.
వికసించే కుసుమం ఒకటి
పరిమళాల చేతులతో
మేదిని ముంగిట
బంగారు రంగవల్లిక దిద్దాలనుకుంది.
ప్రవహించే సెలయేటి గమకం ఒకటి
పుడమి తల్లి చరణ మంజీర
స్వర ధునిలో ఒదిగి పోవాలనుకుంది.

తొలి సంజ లేలేత ఎరుపు
చిగురాకు ఒకటి
సిగ్గుపడ్డ భూమి బుగ్గలో మొగ్గై పూయాలనుకుంది.

స్వార్ధ పరుడైన మనిషి ఒకడు
ఈ నెల తనకే సొంతం అనుకున్నాడు.
ఎవరి భూమి ఇది?
ఎవరి సొంతం ఇది?